Studio18 News - అంతర్జాతీయం / : Viral Video : బర్గర్ అంటే ఇష్టపడనివారు తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, యువత అయితే బర్గర్ ను ఇష్టంగా తినేస్తారు. తాజాగా బర్గర్లతో తయారు చేసిన ఓ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బర్గర్ తో ఇల్లు ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, బర్గర్ లాంటి ఇట్లోనే మనం ఉంటే.. బర్గర్ పరుపుపై పడుకుంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోవటం కాస్త కష్టమే. కానీ, ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన మాయ మన ఊహలకు రూపమిచ్చింది. ఓ యువకుడు ఏఐ సహకారంతో బర్గర్ తో వర్చువల్ ఇంటిని రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఏఐ సహకారంతో రూపొందించిన బర్గర్ హౌస్ టూర్ కు వెళితే.. లోపల అద్భుతంగా ఉంటుంది. బర్గర్ హౌజ్ లోపల అన్ని వస్తువులు బర్గర్ తోనే తయారు చేయబడి ఉన్నాయి. లోపల బర్గర్ ఆకారంలో సోఫా, పరుపు, చీజ్ తో నిండిన బాత్ టబ్, బర్గర్ వాష్ రూమ్, కిచెన్, స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు. బర్గర్ హౌస్ లో ఎటు చూసినా నోరూరించే రకరకాల బర్గర్లే ఈ వీడియో దర్శనమిస్తారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. బర్గర్ హౌస్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోపై బ్రెజిల్ కు చెందిన మెక్ డొనాల్డ్స్ దీనిపై స్పందించింది. ఈ ఇంటీరియర్ డిజైనర్ ఆలోచనా విధానం బర్గర్లను బాగా ఇష్టపడే చిన్న పిల్లల సంబరంలా ఉందని వ్యాఖ్యానించింది. మొత్తంగా ఏఐతో క్రియేట్ చేసిన బర్గర్ హౌస్ అందరిచేత ఔరా అనిపిస్తుంది.
Admin
Studio18 News