Wednesday, 10 December 2025 01:00:51 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Ukraine-Russia War: రష్యాలోకి పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలు.. యుద్ధం భీకరంగా కొనసాగుతోందన్న రష్యా

Date : 08 August 2024 11:26 AM Views : 240

Studio18 News - అంతర్జాతీయం / : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటోంది. ఉక్రెయిన్ అనుకూల దళాలు రష్యా కుర్స్క్‌లోని నైరుతి ప్రాంతంలోకి ప్రవేశించాయి. ట్యాంకులు, సాయుధ దళాలతో అవి సరిహద్దును దాటినట్టు రష్యా తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నామని, భీకర యుద్ధం జరుగుతోందని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు క్షిపణులను తమ వాయు రక్షణ సంస్థ కూల్చివేసినట్టు కుర్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెక్సీ స్మిర్‌నోవ్ తెలిపారు. 300 బలగాలు, 11 ట్యాంకులు, 20కిపైగా సాయుధ వాహనాలతో రాత్రికి రాత్రే ఉక్రెయిన్ దళాలు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ బలగాలు, వాయు దళాలను సరిహద్దులకు పంపినట్టు పేర్కొంది. ఉక్రెయిన్ దాడిలో ఐదుగురు చనిపోయారని, 28 మందికి గాయాలయ్యాయని పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్లు పౌర నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు స్థానిక అధికారులు ఆరోపించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :