Studio18 News - TELANGANA / KARIMNAGAR : మున్సిపల్ అధికారులు లంచం ఇవ్వనందుకు శాంక్షన్ అయిన 60 గజాల ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాన్ని నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై 58 డివిజన్ నాయకులు సోహన్ సింగ్, కమల్జీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ అధికారులు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, లంచం ఇవ్వకపోవడంతో నిర్మాణాన్ని అడ్డుకుంటూ కూల్చివేశారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే ధర్నా చేపడతామని నాయకులు హెచ్చరించారు. అలాగే ఈ ఘటనను మీడియా కవర్ చేయాలని కోరారు.
Admin
Studio18 News