Thursday, 12 March 2026 12:57:35 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం

Date : 07 February 2026 07:14 PM Views : 122

Studio18 News - TELANGANA / MULUGU : మేడారం మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు సుమారు 3 వేల టన్నుల చెత్త పోగైనట్లు అధికారుల అంచనా శుభ్రం చేసేందుకు రంగంలోకి దిగిన 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు జంతు వ్యర్థాలు చూసి వాంతులొస్తున్నాయని కార్మికుల ఆవేదన వ్యర్థాల్లో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలు ఉండటంపై ఆందోళన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు వెనుదిరిగిన అనంతరం మేడారం పరిసరాలు టన్నుల కొద్దీ చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి, పారిశుద్ధ్య సిబ్బందికి పెను సవాల్‌గా మారింది. మేడారంతో పాటు కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు వంటి ప్రాంతాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో సుమారు 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాతిపదికన శుభ్రతా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జంతువుల తోళ్లు, తలకాయలు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయి. ఇంత గలీజు పని మేమెప్పుడూ చేయలేదు" అని కొందరు కార్మికులు వాపోయారు. అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నాం అని వారు కన్నీటిపర్యంతమయ్యారు. జాతరలో పోగైన వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 100 టన్నుల ఖాళీ బాటిళ్లలో చాలా వరకు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. మిగిలిన 52 శాతం బియ్యం, బెల్లం వంటివి భూమిలో కలిసిపోయేవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యర్థాలను వేరు చేసి, మేడారం ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :