Thursday, 26 March 2026 04:58:08 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం

Date : 19 March 2026 03:30 PM Views : 69

Studio18 News - TELANGANA / HYDERABAD : SC నిరుద్యోగులు స్వయం ఉపాధి రుణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ శాఖ తరఫున SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రకటించడం సంతోషకరమని పేర్కొంటున్నారు. అయితే ఈ పథకానికి మార్చి 17 నుంచి 24 వరకు మాత్రమే గడువు ఇవ్వడం పూర్తిగా అన్యాయమని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా పేదలకు సహాయం చేయడానికా లేదా కేవలం ఆశ చూపించడానికేనా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, బస్తీల్లో ఉన్న చాలా మంది SC పేదలకు ఇంకా ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా లేకపోవడంతో వారు మళ్లీ అప్లై చేసి డాక్యుమెంట్లు సేకరించేలోపే గడువు పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వారం లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. అమలు విధానం చూస్తే ఈ పథకం కూడా దళిత బంధు పథకం మాదిరిగా కొంతమంది నాయకులకు తెలిసిన వారికే పరిమితమైపోతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. MLAలకు దగ్గరగా ఉన్న కొద్ది మందికే ఈ అవకాశాలు దక్కితే నిజమైన పేదలకు ఈ పథకం ఎలా చేరుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా SC సామాజిక పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక నెల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీకి ఈ సమాచారం చేరేలా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు మాత్రమే లబ్ధి చేరేలా చూడాలని కోరుతున్నారు. MLAల అనుచరులకు కాకుండా నిజంగా అవసరమైన వారికి ఈ పథకం అందాలని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు కోసం ఎలా ప్రచారం చేస్తారో అదే విధంగా ఈ పథకాల గురించి కూడా ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :