Thursday, 26 March 2026 04:59:16 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

కాంగ్రెస్‌లో చేరితేనే నిధులు ఇస్తామనడం సిగ్గుచేటు: బీఆర్‌ఎస్ సర్పంచుల ఆగ్రహం

Date : 25 March 2026 12:03 PM Views : 10

Studio18 News - TELANGANA / HYDERABAD : పరిగి మార్చి 24 (తెలంగాణ డైలీ న్యూస్): కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిగి నియోజకవర్గ సర్పంచులకు నిధుల కేటాయింపులో రాజకీయ వివక్ష చూపుతున్నారని బీఆర్‌ఎస్ సర్పంచులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులకు ప్రాధాన్యత ఇస్తూ, బీఆర్‌ఎస్ సర్పంచులకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సోమవారం పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరితేనే నిధులు ఇస్తామని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎర వేస్తూ, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి కృషి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలా మా పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామంటూ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని విమర్శించారు. నిధులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :