Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ధర్పల్లి మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ నియమితులయ్యారు. గత పది సంవత్సరాలుగా ధర్పల్లి మండల అధ్యక్షులుగా ఆయన అందించిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయనకు ఈ ఈ సందర్భంగా చిన్న బాల్ రాజ్ మాట్లాడుతూ, పార్టీ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని, పార్టీ గెలుపులో తనవంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Admin
Studio18 News