Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఎన్‌ఆర్‌జీఎస్ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు కాగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయికుమార్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతన్న, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్ గౌడ్, వి.డి.సి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News