Sunday, 29 March 2026 03:18:11 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

వివేక్ వెంకటస్వామి దంపతులు శ్రీరామనవమి సందర్భంగా మందమర్రి, మంచిర్యాల్ ఆలయాలను సందర్శించి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు

Date : 27 March 2026 11:30 PM Views : 23

Studio18 News - TELANGANA / HYDERABAD : మందమర్రిలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన సతీమణితో కలిసి శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మందమర్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంచిర్యాల్ జిల్లా మందమర్రి పాలచెట్టు పంచముఖి ఆంజనేయ దేవాలయం, యపాల్ కోదండ రామాలయం, లోమూడవ జూన్ రామాలయం వంటి ఆలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. శ్రీరామనవమి కల్యాణం పంచముఖి హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ బస్తీల నుండి భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలారు. మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శిల్ప కళాశోభిత కల్యాణ మండపాన్ని రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ప్రధాన అతిధిగా మందమర్రి జియం N. రాధకృష్ణ శ్రీవాణి, యూనియన్ నాయకులు, సింగరేణి అధికారులు, కార్మికులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మినిస్టర్ వివేక్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముడు నీతి, నిజాయితీతో ఎలా జీవించారో ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పలు పథకాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయల బోనస్, అన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు, కొత్త గనులు తెచ్చి ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేపడుతోందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :