Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా మల్యాల మండలం దిగువ కొండగట్టులో ఉన్న ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది
Admin
Studio18 News