Saturday, 14 December 2024 06:25:57 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Vinod Kumar: ఉద్యమకారులపైకి తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతారా?: వినోద్ కుమార్

Date : 10 October 2024 05:10 PM Views : 35

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ఉద్య‌మం సమయంలో ఉద్యమకారుల పైకి తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడితే ఎలా? అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు. తన చరిత్ర అందరికీ తెలుసునన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే కేసీఆర్ తనకు ఉద్యోగం ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుంచి ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎంపీగా రాజీనామా చేసి గెలిచానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్‌తో పాటు కలిసి తాను ప్రయత్నించానని వెల్లడించారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడినట్లు చెప్పారు. సీఎం తన గురించి హేళనగా మాట్లాడినందువల్లే తాను స్పందిస్తున్నానన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ తాము ఇంతలా ప్రచారం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నియామక పత్రాలు పోస్టాఫీస్ ద్వారా వెళ్లేవని, కానీ ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొరివిదెయ్యం అనడం సరికాదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :