Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల అర్బన్ పరిధి అంబారిపేట్ వద్ద నూతనంగా ప్రారంభించిన అర్భన్ పార్క్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా అంబారి పేట్ రైతులకు ఏలాంటి ఆంక్షలు పెట్టొద్దని, రైతులు పొలాలకు వెల్లడానికి ప్రదాన మార్గంగా ఉన్న పార్క్ ద్వారా ఆంక్షలు విధించరాదు అన్నారు. పార్కు సందర్శించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్క్ లో సిసి కెమెరాలు పెట్టాలని సూచించారు. పార్క్ కు వచ్చిన సందర్శకులకు నీటి సమస్య ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Admin
Studio18 News