Sunday, 29 March 2026 05:20:56 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Apple Store: హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్.. ‘టీ-స్క్వేర్‌’లో ఏర్పాటుకు ప్లాన్?

Date : 06 February 2026 07:57 PM Views : 70

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటుకు సన్నాహాలు 2027 నాటికి ప్రారంభం.. కీలక ఉద్యోగాల భర్తీ ఇప్పటికే మొదలు రాయదుర్గంలో నిర్మించే ‘టీ-స్క్వేర్‌’లో ఏర్పాటు చేసే అవకాశం ప్రతిష్ఠాత్మక బ్రాండ్లను ఆకర్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం టీ-స్క్వేర్‌తో పర్యాటకాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం యోచన టెక్ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. హైదరాబాద్‌లో తన తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా ఉన్న నగరంలో యాపిల్ అడుగుపెట్టనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2027 ఆరంభంలో ఈ స్టోర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న యాపిల్, దీనికి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ పరిణామం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్న యాపిల్, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లో రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌పై దృష్టి సారించింది. 2027 మార్చి నాటికి నగరంలో స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికోసం ఏడాది ముందుగానే నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రస్తుతం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ వంటి కీలక పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. త్వరలోనే ఇతర ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్టోర్‌ను హైదరాబాద్ ఐటీ హబ్ అయిన రాయదుర్గంలో నిర్మించనున్న ‘టీ-స్క్వేర్’లో ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ టవర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, టీ-స్క్వేర్‌ను 24 గంటల పాటు పనిచేసేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. యాపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేలా ప్రోత్సాహం అందించాలని స్పష్టమైన సూచనలు చేశారు. టీ-స్క్వేర్‌ను కేవలం వాణిజ్య సముదాయంగా కాకుండా హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భారీ వీడియో బిల్ బోర్డులు, మెరుగైన పార్కింగ్, యుటిలిటీ జోన్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. తద్వారా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడంతో పాటు ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, యాపిల్ స్టోర్‌ను టీ-స్క్వేర్‌లో ఏర్పాటు చేయడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :