Saturday, 24 January 2026 08:23:40 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

చేపల చెరువులో విషప్రయోగం.. 5 టన్నుల చేపలు మృతి

Date : 02 June 2025 01:21 PM Views : 400

Studio18 News - TELANGANA / : తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని శీత్లా తండాలోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేశారు. దీంతో 5 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శీత్ల తండాకు చెందిన బానోత్ కృష్ణ అనే రైతు ఉపాధి హామీ పథకంలో భాగంగా మూడేళ్ల క్రితం తన పొలంలో 30 కుంటల విస్తీర్ణంలో చేపల చెరువును ఏర్పాటు చేసుకున్నాడు. రూ.3 లక్షల పెట్టుబడితో చేపల పెంపకం చేపట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దుండగులు చేపల చెరువులో విష గుళికలు చల్లారు. దీంతో 5 టన్నుల మేర చేపలు మృత్యువాతకు గురయ్యాయి. ఈ ఘటనపై బాధిత రైతు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కాగా, స్థానిక రాజకీయాల్లో కృష్ణ చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :