Studio18 News - తెలంగాణ / : తమ కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్ అన్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవిపై హామీ లభించింది, కానీ నాకు మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యం... మంత్రి పదవి కాదని వివేక్ అన్నారు. త్వరలో హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో మాలల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు అందరూ రావాలని పిలుపునిచ్చారు. మాలల ఐక్యతను చాటుదామన్నారు. దళితుల్లో ఉపకులాలు ఎక్కువగా ఉన్నాయని, వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈరోజు మానకొండూర్ చేరుకుంది. ఆయన పాదయాత్రకు వివేక్ సంఘీభావం తెలిపారు.
Also Read : భార్య సాక్షితో కలిసి ఓటేసిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
Admin
Studio18 News