Saturday, 24 January 2026 07:27:19 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bathukamma |బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీలు అమలు కాకపాయె ఉయ్యాలో..

Bathukamma | బ‌తుక‌మ్మ బతుక‌మ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీలు అమ‌లు కాక‌పాయె ఉయ్యాలో.. అంటూ ముఖ‌రా కే మ‌హిళ‌లు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.

Date : 18 September 2025 07:27 PM Views : 261

Studio18 News - TELANGANA / HYDERABAD : Bathukamma | హైద‌రాబాద్ : బ‌తుక‌మ్మ బతుక‌మ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీలు అమ‌లు కాక‌పాయె ఉయ్యాలో.. అంటూ ముఖ‌రా కే మ‌హిళ‌లు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆరు గ్యారంటీల ప్ల‌కార్డులతో మ‌హిళ‌లు నిర‌స‌న తెలిపారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడపిల్లలకు స్కూటీలు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 4000 పింఛన్ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో అంటూ ప్లకార్డులు పెట్టి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్న ఇంకా మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరని మండిప‌డ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి ఇంకా అమలు చేస్తలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ ప్రజలకు అమలు కానీ హామీలు ఇచ్చి మహిళలను మోసం చేసిందని, ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో వచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్య‌బ‌ట్టారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులు చేసుడు దేవుడెరుగు కానీ ప్రతి మహిళకు నెలకు 2500,పెండ్లి అయిన ఆడ బిడ్డకు తులం బంగారం, పింఛన్ రూ. 4,000, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :