Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో గురువారం ప్రభుత్వ పథకాల అమలుకై నిర్వహిస్తున్న గ్రామసభ రసభాసాగా మారింది. ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాలో లబ్ఢిదార్లుగా ఎంపికైన వారి పేర్లను అధికారులు చదవడంతో అర్హుల పేర్లు లేవని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. మరోవైపు ఆత్మీయ భరోసా కు కటాఫ్ తేదీ ఉండకూడదని, ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని గ్రామస్తులు పట్టుపట్టారు. దాంతో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనర్హుల పేర్లను జాబితాలో నుండి తొలగించి అర్హులకు పథకాలు అందేలా చూడాలని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దాంతో సభలో ఉద్రిక్త వాతవరణం నెలకొనగా పోలీసుల మధ్య గ్రామసభ నిర్వహించారు.
Admin
Studio18 News