Sunday, 29 March 2026 05:21:02 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

మున్సిపల్ పోరులో హామీల బాండ్ పేపర్..

పెళ్లికి రూ.25 వేలు, ఆడపిల్ల పుడితే రూ.10 వేలు అందిస్తానని వెల్లడి

Date : 06 February 2026 01:51 PM Views : 40

Studio18 News - TELANGANA / PEDDAPALLI : తెలంగాణలో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పోరులో నిలిచిన ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే సొంత డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే చేపట్టబోయే పనులు, వార్డు ప్రజల సంక్షేమం కోసం అమలు చేయబోయే పథకాలను మహేశ్ ఓ బాండ్ పేపర్ పై రాసి మరీ విడుదల చేశారు. వార్డులో పెళ్లి చేసుకునే యువతులకు రూ.25,016 కానుక, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని చెప్పారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు. కాగా ప్రచారంలో దూసుకుపోతున్న ఆయనకు అపూర్వ మద్దతు లభిస్తుండగా .. ప్రజల దీవెనలతో విజయం సాధిస్తానంటూ మహేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :