Sunday, 29 March 2026 05:23:58 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KCR: కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ

Date : 29 January 2026 07:51 PM Views : 112

Studio18 News - TELANGANA / HYDERABAD : నంది నగర్ లోని నివాసంలో నోటీసులు అందించిన సిట్ విచారణకు పీఎస్ కు రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు ప్లేస్ చెబితే తామే అక్కడకు వస్తామని వెల్లడి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే... అక్కడకే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి తెలియజేసింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :