Studio18 News - TELANGANA / MANCHERIAL : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ నిర్వహించారు. బెల్లంపల్లి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో రామాటాకీస్ చౌరస్తా, రాజీవ్ కాంప్లెక్స్ వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి-రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై నారికేళ సమర్పణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, బెల్లంపల్లి పట్టణం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పండుగలు మరింత శోభాయమానంగా మారి ఆనందం ద్విగుణీకృతం అవుతుందని నిర్వాహకులను అభినందించారు. పర్వదినం సందర్భంగా తమ అమూల్యమైన సమయం కేటాయించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు అకెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జన్నం సత్యనారాయణ, కోశాధికారి శ్రీరామోజు లక్షణ్ చారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మేడి పున్నం చంద్రు, బేతి శ్రావణ్, నిచ్చకోళ వంశీ, రాంమూర్తి, నాయకులు నీలికృష్ణ, పోలుశ్రీనివాస్, జలెందర్ సింగ్, బండారి ప్రవీణ్ కుమార్, రేగుంట రాజలింగు మరియు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Admin
Studio18 News