Studio18 News - తెలంగాణ / : ఓఆర్‌ఆర్ చుట్టూ 2014 తర్వాత 196 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. చెరువులను ఎఫ్టీఎల్ వరకైనా కాపాడుకోవాలని చెప్పారు. భవిష్యత్ కు ఈ చెరువులను అందించాలన్నదే ఆశ అని తెలిపారు. హరీశ్ రావు, కేటిఆర్ సైతం గతంలో ఈ చెరువులను కాపాడాలని అనలేదా అని నిలదీశారు. మూసీలో ఉన్న పేదలకు నష్టం చేయబోమని, ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. నిరాశ్రయులు అవుతున్న వారితో ప్రభుత్వం మాట్లాడుతుందని అన్నారు. పేదల కోసం చర్చించేందుకు.. ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైతే మూసీ పేదలకు 10వేల కోట్లు ఖర్చుకు సర్కార్ రెడీగా ఉందని అన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేదా అని చెప్పారు. అన్ని పార్టీలు ముందుకు వచ్చి సలహాలు ఇవ్వండని కోరారు. సబర్మతి బాగు చేస్తే పొగుడుతారు.. మూసీ బాగైతే నచ్చదా? అని అన్నారు. పేదవారు ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో తమకు తెలుసని, మరింత మెరుగైన నివాసాలు కల్పిస్తామని తెలిపారు. మూసీ నిర్వాసితులకు మేలుజరిగేలా సలహాలు ఇవ్వండని అడిగారు.
Admin
Studio18 News