Monday, 17 March 2025 04:25:15 PM
# Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను

రైతుకు బేడీలు వేసిన ఘటనపై సభలో చర్చ జరగాల్సిందే: హరీశ్ రావు

సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని అడిగామన్న హరీశ్ రావు రేపు లగచర్ల అంశంపై సభలో చర్చించాలని కోరినట్లు చెప్పిన మాజీ మంత్రి బీఏసీలో చర్చించకుండా సభలో బిల

Date : 16 December 2024 04:27 PM Views : 119

Studio18 News - TELANGANA / : బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని తాము బీఏసీలో అడిగామని, కానీ ఎన్ని రోజులు నడుపుతామనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదని, దీంతో తాము వాకౌట్ చేశామన్నారు. రేపు లగచర్ల అంశంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. చర్చ చేపట్టినప్పుడు ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశమివ్వడం సంప్రదాయమన్నారు. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటన చాలా తీవ్రమైనదని తాము బీఏసీలో చెప్పామన్నారు. ఈ అంశంపై చర్చకు అవకాశమివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బీఏసీ చెప్పినట్లే సభ నడుస్తుందని తాము చెప్పామన్నారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని బీఏసీలో కోరినట్లు తెలిపారు. బీఏసీలో చర్చించకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. పుట్టిన రోజులు, పెళ్లిళ్లు ఉన్నాయంటూ సభను వాయిదా వేయడంపై కూడా తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయం అందిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ వెలుపల ప్రకటన చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ప్రతిరోజు జీరో అవర్ ఉండాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

Also Read : సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :