Studio18 News - TELANGANA / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఈ మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. రామ్మూర్తినాయుడ్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఆయన తుదిశ్వాస విడిచారని ఏఐజీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. రామ్మూర్తినాయుడి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read : 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాం: చంద్రబాబు
Admin
Studio18 News