Sunday, 29 March 2026 05:22:10 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KTR: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

Date : 19 January 2026 07:59 PM Views : 186

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ క్లస్టర్ కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని వెల్లడి తెలంగాణ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయ లాంటిదన్న కేటీఆర్ సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, తెలంగాణపై ఉద్దేశపూర్వక వివక్షేనని లేఖలో ఆయన ఆరోపించారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, దీనిపై పదేళ్లుగా నిరంతరం పోరాడుతున్నామని గుర్తు చేశారు. కేంద్ర బృందాలే అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించినా ఫైళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించారు. సిరిసిల్ల తెలంగాణ వస్త్ర పరిశ్రమకు గుండెకాయ లాంటిదని, ఈ ప్రాంతం 30 వేలకు పైగా పవర్ లూమ్స్‌తో వేలాది కుటుంబాల జీవనాధారమని కేటీఆర్ తెలిపారు. తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాంతాలకు క్లస్టర్లు ఇచ్చి, సిరిసిల్లను విస్మరించడం ప్రాంతీయ వివక్షకు నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన భూమి, విద్యుత్, నీరు, అనుమతులు అన్నీ సిద్ధం చేసిందని గుర్తుచేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదాలు ఇచ్చే కేంద్రం, నిజంగా సామర్థ్యం ఉన్న సిరిసిల్లకు మద్దతు ఇవ్వకపోవడం ద్వంద్వ నీతేనన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ప్రకటించి పదేళ్ల అన్యాయానికి ముగింపు పలకాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :