Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా: మందమర్రి మార్కెట్ ఆస్ర పెద్ద మసీదులో రంజాన్ పండుగను పురస్కరించుకుని రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి, కలెక్టర్ అనంతరం 112 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. చెన్నూరు, మందమర్రిలో కోటి రూపాయలతో షాదీఖానాలు, ఖబరస్తాన్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. మందమర్రిలో ఖబరస్తాన్ ప్రహరీ నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ATC సెంటర్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 బోర్లు వేసినట్లు వెల్లడించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ నేపథ్యంలో 100 కోట్లతో అమృత్ స్కీమ్ పథకం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. మందమర్రిలో పట్టా భూములు ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
Admin
Studio18 News