Studio18 News - TELANGANA / HYDERABAD : నారపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారపల్లి భాగ్యనగరం నందనవనంలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతంగా నిర్వహించారు. రాచకొండ రన్నర్స్, బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్‌లో సుమారు 1,200 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ ఏసీపీ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి, రాచకొండ రన్నర్స్ ప్రభాకర్, ఎల్బీనగర్ ఏసీపీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ ఆరోగ్య రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Admin
Studio18 News