Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని వేములవాడ ఎం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అద్వర్యలో నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు 2025లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్ టి సి బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రోడ్డు ఎక్కిన నుండి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దను కోల్పోతారని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన కొంత మందిలో అయిన మార్పు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆటో యూనియన్ వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని,ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : #RajannaSircilla : ఆందోళనల మధ్య గ్రామసభల నిర్వహణ..
Admin
Studio18 News