Studio18 News - తెలంగాణ / : Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు ఆటోలో అత్యాచారం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ యువతి కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను బంధించి, ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Studio18 News