Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : Rajanna Sircilla district జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ Garima Agrawal స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీకి జిల్లా చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని తెలిపారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ Mahesh B. Gite మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్లు పక్కదారి పట్టినా లేదా బ్లాక్ దందా జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News