Studio18 News - TELANGANA / HYDERABAD : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులందరికీ శుభవార్త వినిపించాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు పెట్టామని తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను ప్రారంభిస్తామన్నారు. సాగులోలేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని తెలిపారు. మరిన్ని నిర్ణయాలు ములుగు మున్సిపాలిటీకి క్యాబినెట్ ఆమోదం పంచాయతీరాజ్‌లో 588 కారుణ్ నియామకాలకు ఆమోదం 200 కొత్త గ్రామ పంచాయతీలకు క్యాబినెట్ ఆమోదం మరో 11 కొత్త మండలాలకు క్యాబినెట్ ఆమోదం
Admin
Studio18 News