Monday, 08 December 2025 03:13:02 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. 2,383 ఓట్లు పెరిగాయి..

Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. 2,383 ఓట్లు పెరిగాయి..

Date : 24 October 2025 06:41 PM Views : 116

Studio18 News - TELANGANA / HYDERABAD : Jubleehills by Poll | హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై జిల్లా ఎన్నిక‌ల అధికారి ఆర్వీ క‌ర్ణ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ తుది జాబితాను ఆర్వీ క‌ర్ణ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 4,01,365 మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్న‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ త‌ర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓట‌ర్లు పెరిగార‌ని చెప్పారు. ఇక త‌నిఖీల్లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 3.69 ల‌క్ష‌ల విలువ చేసే 512 లీట‌ర్ల మ‌ద్యం స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మొత్తం 139 లోకేష‌న్ల‌లో 407 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన తుది ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. నాటి లెక్క‌ల ప్ర‌కారం మొత్తం ఓట‌ర్ల సంఖ్య 3,98,982 మంది కాగా, ఇందులో పురుష ఓట‌ర్లు 2,07,367 మంది, మ‌హిళా ఓట‌ర్లు 1,91,590 మంది, ట్రాన్స్‌జెండ‌ర్లు 25 మంది ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 1.61 శాతం మంది ఓట‌ర్లు పెరిగారు. ఇక 80 ఏండ్ల వ‌య‌సు పైబ‌డిన వారిలో పురుష ఓట‌ర్లు 3,280 మంది, మ‌హిళా ఓట‌ర్లు 2,772 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏండ్ల వ‌య‌సున్న వారు 6,106 మంది ఓట‌ర్లు ఉన్నారు. దివ్యాంగ ఓట‌ర్లు 1,891 మంది ఉన్నారు. ఇందులో చూపులేని వారు 519, శారీర‌క వైక‌ల్యం ఉన్న వారు 667, వినికిడి లోపం ఉన్న వారు 311, ఇత‌ర వైక‌ల్యం ఉన్న‌వారు 722 మంది ఉన్నారు. ఎన్నారై ఓట‌ర్లు 95 మంది ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :