Studio18 News - TELANGANA / : బెట్టింగ్ యాప్స్ పైనా, బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసే వారిపైనా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోరాటం ఓ రేంజిలో కొనసాగుతోంది. తాజాగా, ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైంది.ఈ విషయాన్ని సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ మాట్లాడినందునే అతడిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఇటీవల హర్షసాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్స్ ను తాను ప్రమోట్ చేయకపోతే ఇతరులు ప్రమోట్ చేస్తారని... ఆ డబ్బును ఎందుకు పోగొట్టుకోవడం... అందుకే బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, ఆ విధంగా వచ్చిన డబ్బును పేదలకు పంచుతున్నానని వెల్లడించాడు. ఈ వీడియోను చూసిన సజ్జనార్... హర్షసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News