Studio18 News - TELANGANA / RANGAREDDY : Shabad మండలంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశ ప్రధాన మంత్రి Narendra Modi పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే 22వ విడత రూ.2,000 నిధుల విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని షాబాద్ మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం సీఈఓ శివకుమార్ రెడ్డి, షాబాద్ రైతు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ శివతేజ, ఎరువుల డీలర్ నర్సింహరెడ్డి మరియు వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్ మండలంలోని వివిధ రైతు వేదికల వద్ద ఏఈఓలు మౌనిక, రాజేశ్వరి, లిఖిత, గాయత్రి రైతులకు ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రైతులు Pradhan Mantri Kisan Samman Nidhi ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు
Admin
Studio18 News