Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం: చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. అమర జీవి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ కోమట్లగూడెం వైఎస్సార్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కన్సొలేషన్ బహుమతి అందజేశారు. కనతాల రాంబాబు–సరిత దంపతుల కుమార్తె మను శ్రీకు రూ.10,016 కన్సొలేషన్ బహుమతిగా అందజేశారు. అంతేకాకుండా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం జరిగింది. చిన్నారి విద్యాభివృద్ధికి ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మను శ్రీ తల్లిదండ్రులు వైఎస్సార్ యూత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలు, యువకులు, నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలందరికీ వైఎస్సార్ యూత్ తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సేవకు, చిన్నారుల ప్రోత్సాహానికి మంచి ఉదాహరణగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయ సహకారాలు అందించాలని గ్రామ పెద్దలు, ప్రజలు, యువతి యువకులు కోరారు.
Admin
Studio18 News