Sunday, 08 March 2026 09:44:07 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

KTR: ఆ రైతును నేనూ కలిశాను... నాపై కేసు పెడతారా డీజీపీ గారూ?: కేటీఆర్

Date : 08 October 2024 03:04 PM Views : 442

Studio18 News - TELANGANA / : ఆ రైతును నేను కూడా కలిశాను... అతనితో మాట్లాడాను... మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని, కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలోని ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ పోతగోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై కేసు పెట్టారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పు ఏముందని డీజీపీని ప్రశ్నించారు. జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్‌పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశానని, అతనితో మాట్లాడానని వెల్లడించారు. అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వీడియోలో ఏముంది? కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ దొరుకుతుందని, లేకుంటే కంపలో పడి చచ్చిపోయినట్లేనని రైతు మల్లయ్య అన్నారు. కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్నా రావాలన్నారు. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక... కరెంట్ లేక వ్యవసాయం లేదని, దీంతో చావాలనిపిస్తోందన్నారు. ప్రస్తుత పాలనలో రైతుబంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా రావాలని, ఆయనకే ఈసారి ఓటు వేస్తామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :