Studio18 News - TELANGANA / : Madhavi Latha: కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని టీడీపీ చెప్పిన వివరాలపై బీజేపీ తెలంగాణ నాయకురాలు మాధవీలత స్పందించారు. ఇవాళ ఆమె 10 టీవీతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ అంశంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని మాధవి లత అన్నారు. కేవలం లడ్డు పైనే కాకుండా మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి 100 రోజుల పాలనపై డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అంటున్నారని చెప్పారు. మరి జగన్ హయాంలో జరిగిన సంఘటనల గురించి ఏం మాట్లాడుతారని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్ వరకు అక్కడ అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. అన్యమతస్తులను ఏడోమెంట్ లో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువతే ఒక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. లడ్డూ అంశంతో వైసీపీ అరాచకలను బయట పెట్టారని అన్నారు. ఇది ఇంతటితో ఆగవద్దని, శ్రీవారి మొత్తం అస్తులపైనా విచారణ జరగాలని చెప్పారు. దానిపై అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
Studio18 News