Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో ఇటివల నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలతో పాటూ సోషల్ మీడియా మరియు పలు మీడియాల్లో కల్పిత వార్తలుగా చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొండ నాగేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు చేరుతాయంటూ ఆయన ధోరణిలో మాట్లాడగా .. ప్రతిపక్ష నాయకులు రెండు రోజుల తర్వాత ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఏమి వెలుగబెట్టారు.. కనీసం ఏ గ్రామంలో అయినా 10 ఇండ్లైనా లబ్ధీదారులకు ఇచ్చారా.. ! ఎస్సీ బంధు, బీసీ బంధు అని పథకాలు తెచ్చి లబ్ధి చేకూరిన పేదవారు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆరు పథకాల అమలు విషయంలో అహర్నిశలు కృషి చేస్తూ తన గౌరవమైన వృత్తిని కూడా వదులుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారని.. అలాంటి ఆయనపై వ్యతిరేక ప్రచారాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తూ .. ప్రతిపక్ష పార్టీ అయినా ఆపద అని వచ్చిన ప్రతి ఒక్క పేదవారికి ఎల్వోసీ కానీ కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ వంటి విషయాలలో తన మన అని తేడా లేకుండా అందరికీ సహకరిస్తున్న నేతగా రాజేష్ రెడ్డిని అభివర్ణించారు. ప్రతిపక్షాలు ప్రాంత అభివృద్ధికి సహకరించాలి కానీ ఇలాంటి దుష్ప్రచారాలను చేయడం సరికాదని, ఇక మీదట ఇలాగే జరిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటికైన అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
Admin
Studio18 News