Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలం రాజేశ్వరరావు పేట్ గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్ అభ్యర్థిగా అమ్ముల మల్లికా లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మల్లికా లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, కేంద్రం, రాష్ట్ర స్థాయిలో చేపట్టే పథకాలు సమగ్రంగా ప్రజలకు చేరేలా చూస్తామన్నారు. గ్రామాభివృద్ధికి లక్ష్మణ్ పాటుపడతారని, అందుకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు గ్రామ పెద్దలు.
Admin
Studio18 News