Studio18 News - TELANGANA / NAGARKURNOOL : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి అహంకారం ఆయనకు దేహశుద్ధి చేసే వరకు వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల జెడ్పి హైస్కూల్లో తొమ్మిదవ తరహతి క్లాస్ రూమ్ లో శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పైకి చెప్పు విసిరిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉపాద్యాయుడు చెప్పు విసరడంతో తరగతి గదిలోని ఓ విద్యార్థిని మెడకు, చెవ్వుకు చెప్పు తగలడంతో సదరు విద్యార్థినికి గాయాలయ్యాయి. దాంతో ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేసి హెచ్చరించారు. కాగా ఘటనపై సదరు ఉపాద్యాయుడిని వివరణ కోరగా తరగతి గదిలో ఇద్దరు విద్యార్థినిలు నవ్వారని దాంతో ఆగ్రహంతో చెప్పు విసిరేసినట్లుగా, అది గురితప్పి మరొక విద్యార్థికి మెడకు తగలడంతో గాయాలు అయ్యాయని వివరణ ఇవ్వగా .. విద్యాబుద్దులు చెప్పి విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన ఉపాద్యాయుడే ఈ విధంగా ప్రవర్తించడంపై తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడిపై శాఖ పరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
Studio18 News