Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చరిత్రలో జయంతి తప్ప, వర్ధంతి లేని మహానీయుడు, గొప్ప స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపిన మహనీయున్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాన్నారు. . దేశ భక్తి, సంస్కృతి, సేవ లాంటి భావనలు ప్రతి ఒక్కరిలో ఉండాలని.. అవి ప్రతి వ్యక్తికి కలిగినప్పుడే మనం నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి అంటూ పేర్కోన్నారు. ప్రతి ఒక్కరు దేశ సేవలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.
Admin
Studio18 News