Studio18 News - తెలంగాణ / : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సాహితీ ఇన్‌ఫ్రా నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీలాంచింగ్ ఆపర్ల పేరుతో వేలాది మంది నుంచి సుమారు రూ.2,500 కోట్లు వసూలు చేసి, వారికి ప్లాట్లను అప్పగించకుండా మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2022లో తెలంగాణ పోలీసులు కేసు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలో లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆయనను ఆదివారం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే లక్ష్మీనారాయణ అరెస్టుపై అధికారికంగా ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేయలేదు.
Admin
Studio18 News