Sunday, 29 March 2026 05:25:42 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Mallu BhattiVikramarka: ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో కీలక భేటీ.. స్పందించిన మల్లు భట్టివిక్రమార్క

Date : 27 January 2026 06:43 PM Views : 54

Studio18 News - TELANGANA / HYDERABAD : విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి భట్టివిక్రమార్కతో మంత్రులు సమావేశం ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాకూడదా అని భట్టివిక్రమార్క ప్రశ్న సీఎం అందుబాటులో లేనందున తనతో చర్చించేందుకు వచ్చారని స్పష్టీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నిన్న రాత్రి సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాకూడదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది పాలనాపరమైన అంశాలపై జరిగిన సమావేశమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున మంత్రులు ఉప ముఖ్యమంత్రిగా తనతో చర్చించేందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ భేటీ జరగడం చర్చకు దారి తీసిందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ, కొందరు పిచ్చివాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :