Studio18 News - TELANGANA / HYDERABAD : ఇస్నాపూర్ మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ పెళ్లి మెలి లతా వెంకటేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. శ్రీరామనవమి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డు, ఆంధ్రా కాలనీ, తేజ కాలనీ, ఇస్నాపూర్ విలేజ్, పాశంమైలారం, రుద్రారం మరియు ముత్తంగి డివిజన్‌లోని డీఎన్ కాలనీ, నాగార్జున కాలనీ శివాలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మచ్చ కిషోర్ రెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ బలరాం, రుద్రారం బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News