Thursday, 26 March 2026 05:04:58 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క

Date : 23 March 2026 04:12 PM Views : 17

Studio18 News - TELANGANA / HYDERABAD : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏ బకాయిలను తమ ప్రభుత్వం త్వరలోనే క్లియర్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, అందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన వాటానే రూ. 4,571 కోట్లు ఉందని భట్టి విక్రమార్క వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలను మానవతా కోణంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, వాటిని కూడా త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, అలాగే ఉద్యోగుల కోసం క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు కూడా అందజేశామని గుర్తుచేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :