Saturday, 17 January 2026 10:35:46 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

కాళేశ్వరం కమిషన్ విచారణపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Date : 08 June 2025 03:09 PM Views : 476

Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఈటల.. కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉప సంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదని తెలిపారు. కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్ను కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు బయటపెడతా అని చెప్పారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. కేబినెట్లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏదీ జరగదని గుర్తుచేశారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించలేదనడం సరికాదని అన్నారు. ప్రాజెక్టు విషయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయంపై కేసీఆర్ అందరితో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :