Studio18 News - తెలంగాణ / : Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమంత, నాగార్జున ఇళ్లకు వెళ్లి వారికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని అన్నారు. చట్టవిరుద్ధంగా ఆమె మాట్లాడారు. హైదరాబాద్ లో డ్రగ్స్ దొరుకుతుంది.. కొండా సురేఖ ఏమైనా తీసుకుని మాట్లాడారా? గత ప్రభుత్వం కాల్ లిస్ట్ ఏమైనా దొరికిందా..? మోదీని ఇంకో మోదీ కుటుంబంతో పోల్చారని రెండేళ్ల జైలు శిక్ష, పార్లమెంట్ సభ్యత్వం రద్దు, ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా అంటూ కేపాల్ ప్రశ్నించారు. డీజీపీ ఎందుకు కొండా సురేఖను అరెస్టు చేయలేదు.. ఆమెను వెంటనే అరెస్టు చేయాలి. 72గంటల సమయం ఇస్తున్నాం. పార్టీ నుంచి పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ తొలగించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటీషన్ వేస్తానని అన్నారు. ఒకవేళ కొండా సురేఖతో రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమోనని అనిపిస్తోంది.. ఎందుకంటే.. హైడ్రా పై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో అనిపిస్తుందని పాల్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీక్రెట్ గా ఎందుకు అదానిని కలిశారని కేఏ పాల్ ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.. కేసీఆర్, కేటీఆర్ ను మర్చిపోవాలి.. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇవ్వాలని కేఏ పాల్ ప్రజలను కోరారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలి. లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిల్ దాఖలు చేశానని కేఏ పాల్ తెలిపారు.
Admin
Studio18 News