Monday, 08 December 2025 04:16:17 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

KTR: జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభమైంది... నిజం, ధర్మం మన వైపు ఉంది: కేటీఆర్

Date : 13 October 2025 07:10 PM Views : 160

Studio18 News - TELANGANA / HYDERABAD : కాంగ్రెస్ గురించి తెలిసే గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీని గెలిపించలేదన్న కేటీఆర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్య అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టులో నిలబడదన్న కేటీఆర్ జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తుచేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు సైతం ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ కానీ లేరని ఆయన విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారని, ఈసారి కూడా ఆయన టిక్కెట్ ఆశిస్తారని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనను తప్పించేందుకు కేవలం కాగితంపై 'ఎమ్మెల్సీ' అని రాసి మోసం చేశారని విమర్శించారు. అజారుద్దీన్‌కు ఇచ్చే ఎమ్మెల్సీ నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసని అన్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన తెలిపారు. షేక్‌పేటలో కబరస్థాన్‌కు ఇచ్చిన స్థలం కూడా ఆర్మీకి చెందినదని, అది కూడా కోర్టులో నిలబడదని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పారని, అది కూడా కోర్టులో నిలబడలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసినా ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలను, మైనార్టీలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ధి చెబితే, ఢిల్లీలోని అధిష్ఠానం సైతం ఉలిక్కిపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు మోసపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు. దుర్గాదేవిలాగా, కాళికాదేవిలాగా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని ఇప్పుడు ప్రతి మహిళ అంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయించిందని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో అయితే ఏకంగా 43 దొంగ ఓట్లు నమోదు చేయించారని అన్నారు. కాంగ్రెస్ ఒక్కో వర్గానికి చాలా బాకీ పడిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి ఇలా అన్నీ కాంగ్రెస్ బాకీలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :