Saturday, 24 January 2026 01:42:59 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

R Krishnaiah: బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 14న తెలంగాణ బంద్.. బీజేపీ నేతలను కలిసిన ఆర్ కృష్ణయ్య

Date : 11 October 2025 06:46 PM Views : 272

Studio18 News - TELANGANA / HYDERABAD : బంద్‌కు బీజేపీ మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ నేతలు కోర్టు స్టే, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తనకు తెలియజేశారని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. బీజేపీ నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు స్టేకు నిరసనగా, అలాగే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని అన్నారు. 22 బీసీ సంఘాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్ అని స్పష్టం చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, అందుకే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :