Studio18 News - TELANGANA / : వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భారీ ఆధిక్యతతో దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... వయనాడ్ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఘన విజయంతో ప్రియాంకాగాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని చెప్పారు. వయనాడ్ లో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని ప్రియాంక బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : ఎన్నికల్లో గెలిచినా పదవి కోల్పోనున్న షిండే!
Admin
Studio18 News