Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ తూటి లింగమ్మ దశదిన కార్యక్రమానికి కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఒడిశాలో బొగ్గు గనులను ప్రారంభించి 25 వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిస్తోందన్నారు. అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే ఓపెన్ కాస్ట్ గని సెకండ్ ఫేజ్‌కు సంబంధించి అటవీ అనుమతులు పొందేందుకు సీసీఎఫ్‌ఓ, డీఎఫ్‌ఓలతో మాట్లాడతానని చెప్పారు. 18 సంవత్సరాల పాటు కొనసాగే ఆర్కే ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సింగరేణి సంస్థలో కొత్త గనులు ప్రారంభించి కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో ఒక్క బొగ్గు గని కూడా ప్రారంభించలేదని, బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
Admin
Studio18 News